బాసర గోదావరిలో పెరుగుతున్న వరద

బాసర గోదావరిలో పెరుగుతున్న వరద

ADB: బాసరలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నాందేడ్, పర్బాని జిల్లాల పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో బాసర గోదావరి నదీ తీరం లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.