'నిర్మాణాల కన్నా కూల్చివేతలే అధికం'
NDL: బనగానపల్లెలోని SRBC కాలనీలో ఇవాళ ఈద్గా కూల్చివేత ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈద్గా కూల్చివేత సమయంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాల కన్నా కూల్చివేతలే అధికంగా ఉన్నాయని కాటసాని ఆరోపించారు.