'లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు’

ELR: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డా.గీతాబాయి అన్నారు. గురువారం భీమవరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు పరిశీలించాలన్నారు.