తురకపాలెంలో బస చేసిన MLA

తురకపాలెంలో బస చేసిన MLA

గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామంలో నిద్ర చేశారు. గ్రామ ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టేందుకు స్వయంగా గ్రామంలో ప్రతి వీధి తిరిగి ప్రజలను పలకరించారు. గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన బసలో నిద్రించారు.