ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి: సీపీ

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి: సీపీ

HNK: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని వరంగల్ సీపీ ఎల్కతుర్తి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు.