తైబజార్ రద్దు నిర్ణయం హర్షణీయం
VKB: కొడంగల్ మున్సిపాలిటీలో తైబజార్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ సర్పంచ్ రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో తైబజార్ పేరుతో కాంట్రాక్టర్లు కూరగాయల వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేసేవారని, ఈ భారం ఇప్పుడు తొలగిందని తెలిపారు.