'చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి'
KRNL: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లాలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.