రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: పెద్దమండెం మండలంలోని సిద్దవరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. కలిచర్లకు చెందిన రియాజ్ అహ్మద్ (62), గరీబున్నీషా (53)లు మదనపల్లెకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.