జాతరకు భారీ భద్రత: అదనపు ఎస్పీ

జాతరకు భారీ భద్రత: అదనపు ఎస్పీ

NRPT: కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో గురులోకమసంద్ ప్రభువు జాతర ముగింపు సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ రియాజ్ తెలిపారు. తెల్లవారుజామున జరిగిన తేరు వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలందించిన పోలీసులను అభినందించారు.