గుర్రంపై ఎక్కి స్వారీ చేసిన ఎమ్మెల్యే

GDWL: గద్వాలలోని క్యాంపు కార్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు అందించే శిక్షణపై ఆయన నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి తీసుకొచ్చిన గుర్రంపై ఎమ్మెల్యే ఎక్కి స్వారీ చేశారు. పిల్లలకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వాలన్నారు.