చోరీలకు పాల్పడుతున్న దుండగుడి అరెస్ట్
ADB: ఆలయాలలో చోరీలకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తలమడుగు ఎస్సై రాధిక తెలిపారు. తలమడుగు మండలంలోని లాల్గడ్ గ్రామానికి చెందిన తొడసం లచ్చి రాం ఈ నెల 29న ఉండం గ్రామ శివారులో గల పేట పోచమ్మ గుడిలో చోరీ చేయగా శుక్రవారం దుండగుడిని పట్టుకొని రీమాండ్‌కు తరలించామన్నారు. ఈ నెలలోనే తాంసి మండలంలోని దుర్గామాత ఆలయంలో దొంగతనం చేసినట్లు ఒప్పకున్నట్లు తెలిపారు.