ప్రతీ ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి

విజయనగరం: ప్రతి ఒక్కరూ జలమును పొదుపుగా వాడి భావితరాలకు అందించాలని లోక్ అదాలత్ చైర్మన్ గరికిన దుర్గయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం బొండపల్లి మండలం గొట్లాం గ్రామ సచివాలయంలో ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు తాగునీరు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎస్.ఈ ఉమాశంకర్, ఎంపీడీవో హరిహరరావు పాల్గొన్నారు.