ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలంలో ప్రభుత్వం పేదల కోసం 2399 ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 138 మంది లబ్ధిదారులకు 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం' కింద ఇళ్ల పట్టాలను మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.