గ్రూప్-ఏ అధికారికి పదోన్నతి
SKLM: మందస మండలం గెడ్డవూరు గ్రామానికి చెందిన వంక సురేష్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)లో గ్రూప్-ఏ అధికారిగా పదోన్నతి పొందారు. ఈ ఉత్తర్వులు మంగళవారం జారీ అయినట్టు ఆయన తెలిపారు. మత్యకార గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.