VIDEO: బోడుప్పల్ రోడ్ల పరిస్థితి పై ప్రజల ఆగ్రహం..!

VIDEO: బోడుప్పల్ రోడ్ల పరిస్థితి పై ప్రజల ఆగ్రహం..!

MDCL: బోడుప్పల్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే మార్గంలో కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించామని చెప్పిన అధికారులు, ప్రస్తుతం నోరు మెదపటం లేదు. పనులు ఎందుకు నిలిచిపోయాయో.? స్పందించడం లేదని, వెంటనే రోడ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు.