VIDEO: జనగామలో రెండు కార్లు ఢీ.. పెను ప్రమాదం తప్పింది

VIDEO: జనగామలో రెండు కార్లు ఢీ.. పెను ప్రమాదం తప్పింది

జనగామ పట్టణంలోని కళ్లెం రోడ్డులో ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద శనివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.