గ్యాస్ కొరత.. 29 డొమెస్టిక్ సిలెండర్లు స్వాధీనం

గ్యాస్ కొరత.. 29 డొమెస్టిక్ సిలెండర్లు స్వాధీనం

NRML: గ్యాస్ కొరత నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో శుక్రవారం ఆకస్మికంగా పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమర్షియల్ సిలెండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలెండర్లను వినియోగిస్తున్న 29 సిలెండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా డొమెస్టిక్ సిలెండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.