పీర్లగూడ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
BDK: పీర్లగూడ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పీర్లగూడ సర్పంచ్ షమీం బేగం ఆయనను కలిసి కాంగ్రెస్ తరఫున ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పనుల్లో తన సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించాలని సూచించారు.