బుధనంపల్లి సచివాలయాన్ని సందర్శించిన ఎంపీపీ
సత్యసాయి: ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ఇవాళ మండలంలోని బుధనంపల్లి సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సిబ్బందితో సమీక్షించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు ఇచ్చారు.