సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల ఆకస్మిక తనిఖీ
VZM: విజయనగరం పట్టణంలోని కాట వీధి, మంగళ వీధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహాలను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, భోజనశాల, వంటగదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.