కౌడీడ్‌లో వైభవంగా కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు
VKB: కౌడీడ్‌లో మంగళవారం గ్రామస్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తూ ధనుర్మాసంలో బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కట్టమైసమ్మ తల్లిని బోనాలు, యాటలతో శాంతింపజేశారు. దీంతో అమ్మవారు గ్రామాన్ని కంటికిరెప్పలా చూసుకుంటుందని కౌడీడ్ గ్రామ ప్రజల ప్రగాఢ నమ్మకం.