ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

AKP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68 వర్ధంతిని శుక్రవారం దేవరపల్లి మండలంలోని వేచలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడి. ముత్యాల నాయుడు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో దళితులకు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.