VIDEO: గాజు వంతెనపై సందడే సందడి..!
VSP: పర్యాటక ప్రియులను విశేషంగా ఆకర్షించేందుకు రుషికొండపై ఏర్పాటు చేసిన గాజు వంతెన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు నుంచే ఈ వంతెనపై నడక పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. ప్రారంభమైన మరుసటి రోజు, మంగళవారం వాతావరణం ఆహ్లాదకరంగా, చల్లగా ఉండడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది.