శ్రీవారి ఆలయంలో మొక్కలు నాటిన సిబ్బంది
CTR: పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సిబ్బందితో కలిసి ఆలయ ఆవరణాన్ని శుభ్రం చేశారు. కాగా, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అప్రయోజనాల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు.