సంతమాగులూరులో రోడ్డు ప్రమాదం

సంతమాగులూరులో రోడ్డు ప్రమాదం

BPT: సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో లారీ నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.