కాకినాడలోనూ అక్రమాల 'సృష్టి'

KKD: యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ క్లినిక్, ఆల్ట్రాసౌండ్, డేకేర్ రిజిస్ట్రేషన్లను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఐవీఎఫ్ చికిత్స పేరుతో రూ.6 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడంతో కమిటీ విచారించి చర్యలు తీసుకుంది.