మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

SRKL: వంగర ఎస్సై షేక్ శంకర్ బుధవారం బంగారువలస గ్రామంలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. సైబర్, ఆన్‌లైన్ మోసాలు, మొబైల్ మెసేజ్ రూపంలో వచ్చే లింకులపై తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు.