విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్

విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్

గుంటూరు నగరంపాలెంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొని, చిన్నారులతో మాట్లాడి వారిలోని ప్రతిభను పరిశీలించారు. ఒక తల్లిగా విద్యార్థుల పురోగతిని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పారు. విద్యార్దులు మంచిగా చదివి జీవితంలో ఎదగాలన్నారు.