23 గ్రామాల్లో 94 మంది సర్పంచ్ అభ్యర్థులు
JGL: మెట్‌పల్లి మండలంలోని 23 గ్రామాలలో 94 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా జగ్గసాగర్ గ్రామంలో 12 మంది, అత్యల్పంగా మేడిపల్లి, పెద్దాపూర్, రామారావు పల్లె, సత్తెక్కపల్లిలో ఇద్దరేసి చొప్పున పోటీలో నిలిచారు. చింతల్పేట గ్రామంలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు 11న ప్రకటిస్తామన్నారు.