హైదరాబాద్‌లో బీజేపీ 'జన్ ఆక్రోశ్' పాదయాత్ర
TG: HYDలో బీజేపీ ‘జన్ ఆక్రోశ్’ పాదయాత్ర దోమలగూడ నుంచి ఇందిరాపార్క్ వరకు ఉత్సాహంగా జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా ఈ యాత్రను చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MP ఈటల ఈ పాదయాత్రలో పాల్గొని విపక్షాల వైఖరిని ఎండగట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు జాతీయ జెండాలు చేతబూని నిరసనలో భాగస్వాములయ్యారు.