పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: శ్రీనివాసులు

CTR: జిల్లా పరిషత్ నిధులతో జిల్లాలో వేసవి కాలంలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరత లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.