ఎమ్మెల్యేపై ఆరోపణలు ఖండించిన నేతలు

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌పై వచ్చిన ఆరోపణలు ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణల ప్రచారానికి తెర తీశారని అన్నారు. ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు.