ఆలయాల్లో వరుస చోరీలు.. భయాందోళనలో భక్తులు

ఆలయాల్లో వరుస చోరీలు.. భయాందోళనలో భక్తులు

నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఆలయాల్లో వరుస చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కనియంపాడు రామాలయం, నాగర్పమ్మ ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో గేటు తాళాలు పగలగొట్టి ఆలయాల్లోని హుండీలను ఎత్తుకెళ్లారు. సుమారు రూ.20 వేల వరకు నగదు హుండీలలో ఉంటుందని స్థానికులు తెలిపారు. ఆలయాల అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.