రోడ్డు ప్రమాదం.. రైతు మృతి

రోడ్డు ప్రమాదం.. రైతు మృతి

NDL: మహానంది మండలం గాజులపల్లె సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి (54) అనే రైతు మృతి చెందాడు. గోపవరానికి చెందిన అతడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.