రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదు: ఎస్సై
WNP: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని ఎస్సై హిమబిందు సూచించారు. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ప్రారంభించామని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి పరిమితికి మించి నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపించాలని, లేదంటే నగదును సీజ్ చేస్తామని పేర్కొన్నారు.