పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం..
WGL: గ్రేటర్ వరంగల్‌లోని ఆరేపల్లి ఎస్ బీఐ బ్యాంకు ముందు 163 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ -2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తలపై నుంచి టైర్ వెళ్లినట్లు తెలుస్తుంది. స్థానికులు బస్సును అక్కడే నిలిపివేశారు.