VIDEO: భద్రకాళి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజలు
WGLలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి ఆలయంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు స్వామికి ప్రీతికరమైన కార్తీక మంగళవారం కావడంతో పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు. భక్తులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.