అయ్యప్ప ఆలయానికి బియ్యం వితరణ
SS: ఎం. కొత్తపల్లి బండపై వెలసిన ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి సన్నిధానానికి నల్లమాడ మండలం కురుమాల గ్రామం నుంచి స్వాములు బియ్యం వితరణ చేశారు. అంజి గురుస్వామి, కార్తీక్, సుధాకర్, ముఖేష్, విష్ణు స్వాములు కలిసి ఒక క్వింటా బియ్యాన్ని గురుస్వామి ఆంజనేయులుకు అందజేశారు. ఈనెలలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఈ బియ్యం ఉపయోగపడతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.