మార్కాపురంలో సోనియా బర్త్ డే వేడుకలు
ప్రకాశం: మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ బర్త్ డే వేడుకలను నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్‌లో కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆమె ఎనలేని కృషి చేశారని జిల్లా మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.