62 శాతం కాంగ్రెస్ గెలిచింది: రేవంత్
TG: పంచాయతీ ఎన్నికల్లో 62 శాతం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 7,522 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. 820 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయన్నారు.