VIDEO: 'రైతుల వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేయాలి'
SS: గాండ్లపెంట మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో, రైతుల వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేయాలని సీపీఐ మండల కార్యదర్శి శ్రీరాములు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తూ.. రైతులకు తిరిగి రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు.