స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NLG: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన స్నేహితుడు గడ్డం మహేష్ కుటుంబానికి అతనితోటి మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. మునుగోడు ZP ఉన్నత పాఠశాలలో 2002- 03 పదో తరగతి చదివిన మిత్రులు అండగా నిలిచారు. వారు మహేష్ కుటుంబానికి రూ. 45 వేల సాయం అందించారు. ఎల్లప్పుడూ తమ సహకారాలు ఉంటాయని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. వారికి మహేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.