కుష్టు వ్యాధిపై శిక్షణ తరగతులు

W.G: శనివారం కుష్టు వ్యాధిపై ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. కుష్టు వ్యాధి ఒక క్రిమి వలన కలిగే అంటు వ్యాధి అని, ఇది రెండు రకాలుగా వస్తుందని శిక్షణ తరగతుల జిల్లా కో ఆర్డినేటర్లు రంగనాథ, బాబ్జీ తెలిపారు. వైద్యులు ఈ వ్యాధిపై పూర్తి అవగాహనతో వైద్య సేవలు అందించాలని సూచించారు.