కోదండ రామాలయంలో TTD క్యాలెండర్లు
KDP: TTD ముద్రించిన 2026 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం మేరకు విక్రయిస్తామన్నారు. దీంతో కావల్సినవారు కోదండ రామయ్య ఆలయానికి విచ్చేసి భక్తులు కొనుగోలు చేయాలన్నారు.