రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు చలాన్లు విధించారు.