'నిబంధన తొలగించడంపై BRS నాయకుల సంబరాలు'
ADB: పంటల కొనుగోలు విషయంలో రైతుల వేలిముద్ర నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించడం పట్ల జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సాయంత్రం సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన చేస్తున్న ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించిందన్నారు. రైతుకు అన్నివేళలా పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.