లారీ ఆటో ఢీ.. ముగ్గురికి గాయాలు

మహబూబాబాద్ జిల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా లారీ ఆటో ఢీకొన్నాయి. ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.