తెనాలిలో అయోధ్య శ్రీరాముని 'విల్లు'కు పూజలు
GNTR: అంగలకుదురులోని దాసకూటి ఆశ్రమంలో అయోధ్య శ్రీరాముని 'విల్లు'కు ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముని వంశీయులు అయోధ్యలోని రామ మందిరం ఎదుట నిర్మిస్తున్న కల్యాణ మండపం వద్ద 108 అడుగుల రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీరాముని చేతిలో ఉండే విల్లు, పాదుకలకు ఈ ఆశ్రమంలో పూజలు చేసి అయోధ్యకు పంపుతున్నారు.