'ప్రకృతి వ్యవసాయం ఆర్థికాభివృద్ధి దోహదం చేస్తుంది'
KRNL: ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థికాభివృద్ధి, ప్రజారోగ్య రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఉద్యానవన భవనంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజ వ్యవసాయం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు పొందవచ్చని చెప్పారు.