8 శాతం వృద్ధితో భారత్ దూసుకెళ్తోంది: ముకేష్
భారత్ 8 శాతం వృద్ధితో దూసుకుపోతుందని బిలయనీర్ ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా కుదేలు అవుతున్న వేళ భారత్ మరింత ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తోందని చెప్పారు. ఈ సమయంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తయారీ రంగంలోనూ సొంతంగా ఎదగాలని సూచించారు. ఇందుకు ఆత్మ నిర్భర్ ఎంతో దోహదపడుతుందన్నారు.